వర్ధన్నపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

 వర్ధన్నపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్​జిల్లా వర్ధన్నపేట పట్టణం, మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులు 41 మందికి సుమారు రూ.14 లక్షల 90వేలను ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్, రవీందర్, శ్రీలత, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండలాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు మైస సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.